Share News

ప్రజలకు సమర్థ సేవలు అందించాలి

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:20 AM

ప్రజలకు సమర్థవంతమైన పోలీసు సేవలను అందించాలని డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా ఆదేశించారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో శుక్రవారం అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి, అనంతపురం రేంజ్‌ డీఐజీ షీమోషీతో కలిసి జిల్లాలో పోలీసింగ్‌, శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, పోలీసు సంక్షేమం తదితర అంశాలపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రజలకు సమర్థ సేవలు అందించాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా

పోలీసులకు డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా ఆదేశం

శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలపై ఆరా

చిత్తూరు అర్బన్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రజలకు సమర్థవంతమైన పోలీసు సేవలను అందించాలని డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా ఆదేశించారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో శుక్రవారం అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి, అనంతపురం రేంజ్‌ డీఐజీ షీమోషీతో కలిసి జిల్లాలో పోలీసింగ్‌, శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, పోలీసు సంక్షేమం తదితర అంశాలపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న పరిపాలన చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజా సేవల మెరుగుదలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ప్రజలకు అందిస్తున్న సేవలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, నైట్‌బీట్‌ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్‌ పోలీసింగ్‌, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై డీజీపీ క్షుణ్ణంగా సమీక్షించారు. ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పలు సూచనలు చేశారు. అనంతరం డ్రగ్స్‌, గంజాయి నిరోధక తనిఖీలు, అవగాహన కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న చర్యలను ఎస్పీ తుషార్‌ డూడీ వివరించారు. మహిళల భద్రతకు అధిక ప్రాఽధాన్యమిస్తూ శక్తిటీమ్‌ ద్వారా తక్షణ స్పందన, అవగాహన కార్యక్రమాలు, భద్రతా చర్యలను సమర్థంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా పోలీసుశాఖ ధైర్యస్పర్శ, జన విశ్వాస్‌, సురక్షిత చిత్తూరు కార్యక్రమాల ద్వారా మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, సైబర్‌ నేరాల నివారణ, రోడ్ల భద్రతపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డీజీపీకి వివరించారు. ధైర్య స్పర్శ లాంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో భరోసా ఏర్పడుతుందని ఎస్పీని డీజీపీ అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌, జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 01:20 AM