Share News

ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పో విజయవంతం

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:47 AM

ఆంధ్రజ్యోతి - ఐఆర్‌ఎంఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌) సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పో విజయవంతమైంది.

ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పో విజయవంతం
ఎక్స్‌పోలో పాల్గొన్న విద్యాసంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలందజేస్తున్న ఆంధ్రజ్యోతి బీఎం సురేష్‌రెడ్డి

తిరుపతి(నేరవిభాగం/రూరల్‌), మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి - ఐఆర్‌ఎంఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌) సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పో విజయవంతమైంది.తిరుచానూరులోని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో రెండు రోజుల పాటు జరిగిన ఎక్స్‌పోకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులనుంచి విశేష స్పందన లభించింది.30కి పైగా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కన్సల్టెన్సీ సంస్థలు పాల్గొన్న ఈ ఎక్స్‌పోకు ఇంటర్మీడియట్‌, ప్రీ-డిగ్రీ అనంతరం ఏ కోర్సు ఎంచుకోవాలో సందిగ్ధంలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై అవకాశాలను పరిశీలించారు. ఎక్స్‌పోలో పాల్గొన్న విద్యాసంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి, కోర్సులు, వ్యవధి, ఫీజులు, ప్లేస్‌మెంట్లు, వసతి సదుపాయాలు వంటి వివరాలతో పాటు విదేశీ విద్య అవకాశాలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు.సందర్శకుల సౌకర్యార్థం ఐఆర్‌ఎంఎస్‌ ఫౌండర్‌ సీఈవో రాజ. సి, టర్న్‌కీ ఈవెంట్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో రాధాకృష్ణన్‌ టీకే నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశంలో వారిద్దరికీ ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ సురే్‌షరెడ్డి జ్ఞాపికలు అందజేశారు.

Updated Date - Mar 30 , 2026 | 12:47 AM