Share News

చెవిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:34 AM

లిక్కర్‌ స్కాం కేసులో నిందితులుగా వున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి(ఏ38) నివాసంలో ఈడీ అధికారులు గురువారం సోదాలు నిర్వంచారు. చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి (ఏ39)ని విచారించడానికి చైన్నెకి చెందిన నలుగురు ఈడీ అధికారులు బి. నారాయణరావు, అంకుర,పృధ్వీరాజ్‌, దీరజ్‌, ఇద్దరు బ్యాంకు అధికారులు, నలుగురు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు శుక్రవారం ఉదయం 7.30గంటలకు తిరుపతి శివార్లలో వున్న తుమ్మలగుంటలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

 చెవిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
-ఈడీ అధికారులతో మోహిత్‌రెడ్డి

  • దాదాపు 8.30గంటలపాటు మోహిత్‌రెడ్డి విచారణ

  • ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటివద్ద్దే ఈడీ బృందం

తిరుపతి రూరల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : లిక్కర్‌ స్కాం కేసులో నిందితులుగా వున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి(ఏ38) నివాసంలో ఈడీ అధికారులు గురువారం సోదాలు నిర్వంచారు. చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి (ఏ39)ని విచారించడానికి చైన్నెకి చెందిన నలుగురు ఈడీ అధికారులు బి. నారాయణరావు, అంకుర,పృధ్వీరాజ్‌, దీరజ్‌, ఇద్దరు బ్యాంకు అధికారులు, నలుగురు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు శుక్రవారం ఉదయం 7.30గంటలకు తిరుపతి శివార్లలో వున్న తుమ్మలగుంటలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో చెవిరెడ్డి తల్లి మునిరత్నమ్మ, సోదరుడు రఘునాథరెడ్డితో మాట్లాడారు.బెంగళూరులో ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి సమాచారం అందడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ఇంటికి వచ్చేదాకా బయట వెయిట్‌ చేశారు. అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ బి. నారాయణరావు సారథ్యంలో ఈడీ బృందం రాత్రి 8.30గంటల వరకూ మోహిత్‌రెడ్డిని విచారించింది. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. కాగా సిట్‌ సేకరించిన రికార్డులను తీసుకున్న ఈడీ బృందసభ్యులు వాటిని మోహిత్‌రెడ్డికి చూపించి ధ్రువీకరించుకున్నారు. చెవిరెడ్డికి సంబంధించిన కేవీఎస్‌ ఇన్‌ఫ్రా, సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా పేరిట ఉన్న ఆస్తులతో పాటు మరో నాలుగు కంపెనీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారని తెలిసింది. మోహిత్‌రెడ్డి నుంచి పలు సమాధానాలు రాబట్టి వాటిని రాతపూర్వకంగా రికార్డు చేశారు. ఈ రికార్డులకు పంచనామా నిర్వహించి మోహిత్‌రెడ్డి నుంచి సంతకం తీసుకుని వెళ్లారు.గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్‌ కుంభకోణంలో చెవిరెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్‌ గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపింది. ప్రస్తుతానికి చెవిరెడ్డి బెయిల్‌పై ఉన్నారు.

ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పా:మోహిత్‌రెడ్డి

ఈడీ సోదాలు ముగిసిన తర్వాత మోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన రికార్డులు, డాక్యుమెంట్లు ఇచ్చానని, అధికారుల బృందం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఎన్నికల్లో ఒక మద్యం బాటిల్‌ కూడా తాము ఎక్కడా పంపిణీ చేయలేదన్నారు.ఈడీపైన, న్యాయవ్యవస్థపైన నమ్మకం ఉందని, నిర్దోషులుగా బయటపడతామని తెలిపారు.

Updated Date - Apr 25 , 2026 | 01:34 AM