తిరుపతిలో ఈట్ స్ట్రీట్ ప్రారంభం
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:33 AM
తిరుపతి నగరంలో ఈట్ స్ట్రీట్‌ను గురువారం రాత్రి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య ప్రారంభించారు.
తిరుపతి సెంట్రల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో ఈట్ స్ట్రీట్‌ను గురువారం రాత్రి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డులో ఈట్ స్ట్రీట్‌ను ఏర్పాటు చేయగా మాజీ డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులతో కలిసి దుకాణాలను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, దాదాపు రూ.1.63 కోట్లతో 14 కంటైనర్ల ద్వారా అన్ని రకాల ఆహార పదార్థాలు ఒకేచోట లభించేలా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఆహార పదార్థాలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కమిషనర్ మాట్లాడుతూ, మే ఒకటో తేదీనుంచి అన్ని దుకాణాలు అందుబాటులోకి వస్తాయన్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, గంగమ్మ ఆలయ చైర్మన్ మహే్‌షయాదవ్, టీడీపీ నాయకులు ఆముదాల తులసీరాం, ఆనంద గౌడ్, పత్తిపాటి వివేక్, అనిల్ రాయల్, రామ్మోహన్, గురవయ్య యాదవ్, అధికారులు పాల్గొన్నారు.