సామాన్య భక్తులకు సులభ దర్శనం
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:53 AM
ముక్కంటి ఆలయ ఆవరణలోని బ్రహ్మగుడి వద్ద మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలు శాఖల అధికారులతోఔ సమావేశం జరిగింది.
శ్రీకాళహస్తి, జనవరి 22(ఆంధ్రజ్యోతి):శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల విజయవంతానికి సమన్వయంతో కృషిచేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ముక్కంటి ఆలయ ఆవరణలోని బ్రహ్మగుడి వద్ద మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలు శాఖల అధికారులతోఔ సమావేశం జరిగింది. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సామాన్యభక్తులకు దర్శనం సజావుగా కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రోటోకాల్‌కు అనుగుణంగా నిర్దేశించిన సమయాల్లో వీఐపీలు దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. శానిటేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చి ఆలయ పరిసరాల్లో సుందరీకరణ ఉండేలా చూడాలన్నారు. రూట్‌మ్యా్‌పలో డిజిటల్ బోర్డు అందుబాటులో ఉంచాలని తెలిపారు. బాల్యవివాహాలు జరగకుండా ఐసీడీఎస్, పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో అన్నిశాఖల అధికారులు ఉండాలని సూచించారు.ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ అవసరమైచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, పాలకమండలి సభ్యులు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిపాలన భవనంలో చైర్మన్ కొట్టేసాయి, ఈవో బాపిరెడ్డి ఆలయ అధికారులతో సమీక్షించారు.