Share News

అభిషేక సమయంలో తైలం.. పోస్తే పాలలా..!

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:59 AM

ఐరాల మండలం చినవెంకటంపల్లె సమీపంలోని మృత్యుంజయ ఈశ్వరాలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. మూలవిరాట్‌కు వారం కిందట అభిషేకం నిర్వహించే సమయంలో నువ్వుల నూనె పోస్తే.. తెల్లగా పాలలా మారడాన్ని అర్చకుడు గుర్తించారు.

అభిషేక సమయంలో తైలం.. పోస్తే పాలలా..!
అభిషేక సమయంలో పాలలా మారుతున్న తైలం, అభిషేకం అనంతరం యథావిధిగా ఉన్న తైలం

మృత్యుంజయ ఈశ్వరాలయంలో ఘటన

ఐరాల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఐరాల మండలం చినవెంకటంపల్లె సమీపంలోని మృత్యుంజయ ఈశ్వరాలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. మూలవిరాట్‌కు వారం కిందట అభిషేకం నిర్వహించే సమయంలో నువ్వుల నూనె పోస్తే.. తెల్లగా పాలలా మారడాన్ని అర్చకుడు గుర్తించారు. అభిషేకం పూర్తయ్యాక తిరిగి తైలం పోస్తే అది తెల్లగా మారకపోవడం గమనార్హం.దీనిపై తిరుపతిలోని ఎస్వీయూ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్‌ పద్మావతిని అడగ్గా.. శివలింగంపై సహజంగానే నీటి ధార పడడం ఉంటుందన్నారు. ఈ తేమకు నువ్వుల నూనె తోడైనప్పుడు ఇలా తెలుపు వర్ణంతో కూడిన దృశ్యం కనిపించవచ్చన్నారు. దీనికితోడు ఆలయం లోపలున్న లైటింగ్‌ ప్రతిబింబించడం వల్ల కూడా ఇలా కనబడవచ్చన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇంతకుమించిన శాస్త్రీయ నిర్ధారణ ఏమీ ఉండదన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 01:59 AM