రైళు కింద పడి డీటీ ఆత్మహత్య!
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:36 AM
చిత్తూరు రూరల్ మండలంలోని సిద్ధంపల్లి రైల్వేగేటు వద్ద గురువారం రాత్రి ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
చిత్తూరు రూరల్, జూలై 23(ఆంధ్రజ్యోతి): చిత్తూరు రూరల్ మండలంలోని సిద్ధంపల్లి రైల్వేగేటు వద్ద గురువారం రాత్రి ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతడు అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ విభాగంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులుగా తెలుస్తోంది. కాట్పాడి- తిరుపతి ప్యాసింజర్ కింద పడి మరణించినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు. ఇతడు గతంలో లక్కిరెడ్డిపల్లి తహసీల్దార్‌గా సస్పెండయ్యారని తెలుస్తోంది. ఇటీవల పనిష్మెంట్ కింద మదనపల్లె కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇతడి ఆత్మహత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాన్ని ఉంచారు.