టమోటా ధరల పతనం
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:30 AM
పట్టణంలోనిమార్కెట్‌లో టమోటా ధరలు పడిపోయాయి. నెల రోజుల క్రితం 15 కిలోల బాక్సు రూ.300నుంచి రూ.350 వరకు పెరిగింది. తరువాత తగ్గుతూ వచ్చింది. రూ.200 నుంచి ధర రూ.150 నుంచి పలికి రూ.170కి పరిమితమవుతూ వచ్చింది.
పలమనేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోనిమార్కెట్‌లో టమోటా ధరలు పడిపోయాయి. నెల రోజుల క్రితం 15 కిలోల బాక్సు రూ.300నుంచి రూ.350 వరకు పెరిగింది. తరువాత తగ్గుతూ వచ్చింది. రూ.200 నుంచి ధర రూ.150 నుంచి పలికి రూ.170కి పరిమితమవుతూ వచ్చింది. ఈనెల 14న మొదటి రకం 15 కిలోల బాక్సు రూ.250 పలకండంతో రైతులు ఆనదపడ్డారు. ధరలు పెరుగుతాయని ఆశపడ్డారు. మర్నాడు నుంచీ ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. మూడు రోజులుగా 15 కిలోల బాక్స్ రూ.180కే పరిమితమైంది. టమోటా సాగుకు వినియోగించే మల్చింగ్ పేపర్, ఎరువులు, విత్తనాలు, డ్రిప్‌లో పంపే ఎరువులు, పూత,కాయదశల్లో వాడే క్రిమిసంహారక మందుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయని రైతులు చెబుతున్నారు. ఈక్రమంలో ధరల పతనం నిరాశ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.