Share News

టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్‌ నిఘా

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:50 AM

మదనపల్లె జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్‌ పేర్కొన్నారు.

టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్‌ నిఘా

మదనపల్లె అర్బన్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కేంద్రాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే కెమెరాలు గుర్తిస్తాయన్నారు. అదే సమయంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలు తెరిచినట్లు గుర్తిస్తే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 01:50 AM