ఈట్ స్ట్రీట్‌లో దుకాణ కేటాయింపులకు డ్రా
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:13 AM
ఈట్‌స్ట్రీట్‌లో దుకాణాలు పొందిన వారు ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారాలు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య దుకాణదారులకు సూచించారు.
తిరుపతి సెంట్రల్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఈట్‌స్ట్రీట్‌లో దుకాణాలు పొందిన వారు ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారాలు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య దుకాణదారులకు సూచించారు. ఈట్‌స్ట్రీట్‌లోని 14 దుకాణాలకు బుధవారం కచ్చపి ఆడిటోరియంలో లక్కీడ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎదురుగా ఏర్పాటు చేసిన 14 దుకాణాలకు పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహించామన్నారు. ఇందులో 13 దుకాణాలను లాటరీ ద్వారా అభ్యర్థులకు కేటాయించగా, 10వ నెంబరు దుకాణాన్ని ఐస్టోన్ కంపెనీకి నేరుగా కేటాయించామని తెలిపారు. దుకాణదారులు ఖచ్చితంగా ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార నాణ్యతా ప్రమాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రెజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటేశ్వరరావు, జగదీష్, నగరపాలకసంస్థ సిబ్బంది పాల్గొన్నారు.