Share News

ఏడుస్తూ వెళ్లిపోయిన ద్రాక్షాయణి

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:55 AM

పుంగనూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి తనకు ఇస్తానని చెప్పి మాటమార్చి మోసం చేశారని 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ ఎం.ద్రాక్షాయణి ఏడుస్తూ కౌన్సిల్‌ హాల్‌నుంచి వెళ్లిపోయారు.

ఏడుస్తూ వెళ్లిపోయిన ద్రాక్షాయణి
టీడీపీ ఇన్‌చార్జి మధుసూదన్‌నాయుడిని ప్రశ్నిస్తున్న ద్రాక్షాయణి

పుంగనూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పుంగనూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి తనకు ఇస్తానని చెప్పి మాటమార్చి మోసం చేశారని 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ ఎం.ద్రాక్షాయణి ఏడుస్తూ కౌన్సిల్‌ హాల్‌నుంచి వెళ్లిపోయారు. సోమవారం కౌన్సిల్‌ హాల్‌లో వైస్‌ చైర్మన్‌గా దేశాది ప్రకాశ్‌ పేరును టీడీపీ ఇన్‌చార్జి మధుసూదన్‌ నాయుడు ప్రకటించగానే ద్రాక్షాయణి భర్త, టీడీపీ నాయకుడు మధుసూదన్‌రాయల్‌ ప్రశ్నించారు. పార్టీకి కష్టపడిన వారికి అన్యాయం చేస్తున్నారని, కౌన్సిలర్లతో ఈ ఎన్నికపై ఓటింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కోసం దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని ఆర్థికంగా నష్టపోయామంటూ నిలదీయడంతో సీఐ సుబ్బరాయుడు, పోలీసులు అతన్ని బయటకు తీసుకెళ్లారు. తమకు అన్యాయం చేశారని కౌన్సిలర్‌ ద్రాక్షాయణి టీడీపీ ఇన్‌చార్జిని ప్రశ్నిస్తుండగా టీడీపీ నాయకుడు సోమల సురేశ్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో పోలీసులు బయటకు వెళ్లాలని సూచించగా ఆమె కంటతడి పెడుతూ వెళ్లిపోయారు.

Updated Date - Nov 24 , 2026 | 12:55 AM