గౌరవ వే తనాలొద్దు..కనీస వేతనాలివ్వండి
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:01 AM
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకు గౌరవ వేతనాలు వద్దని.. కనీస వేతనాలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండు చేశారు.
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల రిలేదీక్ష
చిత్తూరు అర్బన్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకు గౌరవ వేతనాలు వద్దని.. కనీస వేతనాలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండు చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం జిల్లాలోని పలుచోట్ల తహసీల్దార్, ప్రాజెక్టు కార్యాలయాల వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 27న కలెక్టరేట్ ముట్టడి.. అప్పటికీ స్పందించకపోతే మార్చి 2న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద దీక్షకు చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల మండలాలకు చెందిన వర్కర్లు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం వద్ద కూర్చున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండు చేశారు.