పెన్‌డౌన్‌లో రెండు వర్గాలుగా దస్తావేజు లేఖరులు
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:43 AM
మదనపల్లె డాక్యుమెంట్ రైటర్లు బుధవారం చేపట్టిన పెన్‌డౌన్ కార్యక్రమం గంగదరగోళంగా మారింది. రిజిస్ర్టేషన్ శాఖలో దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 396 వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
మదనపల్లె, జూలై 8(ఆంధ్రజ్యోతి): మదనపల్లె డాక్యుమెంట్ రైటర్లు బుధవారం చేపట్టిన పెన్‌డౌన్ కార్యక్రమం గంగదరగోళంగా మారింది. రిజిస్ర్టేషన్ శాఖలో దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 396 వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి శనివారం వరకు విధులు బహిష్కరించి పెన్‌డౌన్ చేపట్టాలని మొదట్లో ప్రకటించారు. అయితే బుధవారం సాయంత్రానికే పరిమితం చేసి, గురు, శుక్రవారం నుంచి యథావిధిగా డాక్యుమెంట్లు రాయాలని కొందరు ప్రకటించడం గందరగోళానికి, వాగ్వాదానికి దారితీసింది. ముందుగా ప్రకటించినట్లు మూడు రోజులూ ఆందోళన చేయాలని కొందరు రైటర్లు ప్రకటించగా మరికొందరు దీన్ని తిరస్కరించారు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి ‘నిజమైన దళారులు మీరే’ అంటూ ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే వారైతే పెన్‌డౌన్ కొనసాగించాలని, నిరసన తెలపాలని సూచించారు. అధికారులతో కొందరు రైటర్లు చేసుకున్న లోపాయికారి ఒప్పందంతో వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వాగ్వాదానికి దిగడం గందరగోళానికి దారితీసింది. కమీషన్లకు ఆశపడి సంఘం ఆశయాన్ని, లక్ష్యాన్ని నీరుగార్చారని ఆ సం ఘం రాష్ట్ర కార్యదర్శి కంగేరి నందా రైటర్లపై ధ్వజమెత్తారు. దీన్ని మరో వర్గం వారు ఖండించారు.ఈ క్ర మంలో శిబిరం నుం చి ఎవరి దారిన వా రు లేచి వెళ్లిపోవడంతో కార్యక్రమ ం ముగిసింది.