Share News

ఓటీ‘ఎస్‌’ అంటారా!

ABN , Publish Date - Jan 22 , 2026 | 02:49 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, దాని పరిధిలో 40 శాఖలు, వాటి కింద 75 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి (సింగిల్‌ విండో) సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 10-15 ఏళ్లుగా పలు రకాల రుణాలు తీసుకుని చెల్లించని వారున్నారు. ఈ మొండి బకాయిల మొత్తం రూ. వంద కోట్లకు చేరింది. దీనిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కొంతవరకు వసూలు, రెన్యువల్‌ చేస్తున్నా.. సహకరించని వారే ఎక్కువ. వైసీపీ ప్రభుత్వంలోని పాలకవర్గం ఈ బకాయిల వసూళ్లపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2015 నుంచి చెల్లించకుండా నిలిచిపోయిన మొండి బకాయిల సమస్యను పరిష్కరించాలని ఆప్కాబ్‌కు సూచించింది. దీంతో 2015కు ముందు రుణం తీసుకుని అసలు కంటే వడ్డీ ఎక్కువ లేదా దానికి సమానమైన మొత్తాల వివరాలను సేకరించి పంపాలని ఆప్కాబ్‌ డీసీసీబీని ఆదేశించింది. ఆ మేరకు డీసీసీబీ బ్రాంచీల్లో, సింగిల్‌విండోల్లో మొండి బకాయిలుగా మారిన రూ.వంద కోట్ల వివరాలపై గతవారం ఆస్కాబ్‌కు నివేదిక పంపారు.

ఓటీ‘ఎస్‌’ అంటారా!

  • ప్రత్యామ్నాయం సూచిస్తారా

  • డీసీసీబీలో రూ.వంద కోట్ల మొండి బకాయిలపై ఆప్కాబ్‌ నిర్ణయమేంటో?

  • నేడు అమరావతిలో సమావేశం

చిత్తూరు డీసీసీబీకి మొండి బకాయిలు అక్షరాలా వంద కోట్లు. దీన్నుంచి బయట పడాలంటే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పరిష్కారమని పాలకవర్గం అంటోంది. దీనిపై బుధవారం అమరావతిలో జరిగే సమావేశంలో ఆప్కాబ్‌ సానుకూలంగా స్పందిస్తుందా.. ప్రత్యామ్నాయ మార్గం సూచిస్తుందా అనేది తెలియాలి.

- చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, దాని పరిధిలో 40 శాఖలు, వాటి కింద 75 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి (సింగిల్‌ విండో) సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 10-15 ఏళ్లుగా పలు రకాల రుణాలు తీసుకుని చెల్లించని వారున్నారు. ఈ మొండి బకాయిల మొత్తం రూ. వంద కోట్లకు చేరింది. దీనిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కొంతవరకు వసూలు, రెన్యువల్‌ చేస్తున్నా.. సహకరించని వారే ఎక్కువ. వైసీపీ ప్రభుత్వంలోని పాలకవర్గం ఈ బకాయిల వసూళ్లపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2015 నుంచి చెల్లించకుండా నిలిచిపోయిన మొండి బకాయిల సమస్యను పరిష్కరించాలని ఆప్కాబ్‌కు సూచించింది. దీంతో 2015కు ముందు రుణం తీసుకుని అసలు కంటే వడ్డీ ఎక్కువ లేదా దానికి సమానమైన మొత్తాల వివరాలను సేకరించి పంపాలని ఆప్కాబ్‌ డీసీసీబీని ఆదేశించింది. ఆ మేరకు డీసీసీబీ బ్రాంచీల్లో, సింగిల్‌విండోల్లో మొండి బకాయిలుగా మారిన రూ.వంద కోట్ల వివరాలపై గతవారం ఆస్కాబ్‌కు నివేదిక పంపారు.

అపరాధ రుసుమే భారం

ఒక రైతు రుణం తీసుకుంటే 12 నెలల కాలానికి ఏడు శాతం వడ్డీ పడుతుంది. ఆ గడువు దాటితే అసలు, వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తారు. దీనినీ గడువులోగా కట్టకపోతే దానిపై ఇంట్రెస్ట్‌ ఆన్‌ ఓడీ (వాయిదా మీరిన అప్పుపై మళ్లీ వడ్డీ వేయడం) వేస్తారు. ఇలా వడ్డీలకు వడ్డీలు పడుతూ ఉంటాయి. ఈ గడువుదాటితే ఎన్‌పీఏ కిందకు పడుతుంది. ఈ పరిస్థితి దాటి బ్యాంకులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఓటీఎస్‌ (వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌) ఒక్కటే మార్గమని పాలకవర్గం ఆప్కాబ్‌ను కోరింది.

ఓటీఎస్‌ పరిష్కారమా?

ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులైతే తమకు వచ్చే లాభాల్లో కొంత దాచుకుంటూ ఇలా పేరుకుపోయిన అప్పుల రికవరీకి ఓటీఎస్‌ కింద రుణ వసూళ్లు చేసుకుంటారు. దీనిని వన్‌టైం సెటిల్‌మెంట్‌ విధానం అంటారు. సహకార బ్యాంకుల్లో ఈ పద్ధతి లేదు. అలా కావాలంటే ఆప్కాబ్‌ అనుమతించాలి. ఈ నష్టాన్ని ఆప్కాబ్‌, డీసీసీబీ, సింగిల్‌విండోలు భరించాలి. ఒకవేళ ఓటీఎస్‌ వచ్చినా భరించే పరిస్థితుల్లో బ్యాంకులు, సింగిల్‌విండోలు లేవని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో గురువారం జరిగే సమావేశంలో మొండి బకాయిలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

Updated Date - Jan 22 , 2026 | 02:49 AM