Share News

మంచి చేస్తే హీరో, లేకపోతే జీరో!

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:41 AM

‘మన ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్లడ్‌లోనే రాజకీయం ఉంది.జనానికి మంచి చేస్తే హీరో చేస్తారు.లేకపోతే జీరో చేస్తారు. గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీని ప్రజలు ఎలా శిక్షించారో చూశాం కదా’ అని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

మంచి చేస్తే హీరో, లేకపోతే జీరో!

గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి అదేంటో జనం చూపించారు

శ్రీకాళహస్తి టీడీపీ కార్యకర్తలతో లోకేశ్‌

తిరుపతి సిటీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘మన ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్లడ్‌లోనే రాజకీయం ఉంది.జనానికి మంచి చేస్తే హీరో చేస్తారు.లేకపోతే జీరో చేస్తారు. గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీని ప్రజలు ఎలా శిక్షించారో చూశాం కదా’ అని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం రేణిగుంట సమీపంలోని కొత్తపాలెంలో జరిగింది. ఈ సమావేశంలో లోకేష్‌ మాట్లాడుతూ ‘బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గాలి ముద్దు కృష్ణమ నాయుడు, రామకృష్ణా రెడ్డి, శివప్రసాద్‌ వంటి గొప్ప నాయకులు మన పార్టీ సొంతమైతే వాళ్ల ఆశయాలను రెండోతరం నెరవేర్చే పనిలో వుంది.అదే గొడ్డలి పార్టీలో దోపిడీదారులు, దౌర్జన్యకారులు వుంటారు. లిక్కర్‌ స్కాం, టీడీఆర్‌ బాండ్ల స్కాంలతో మునిగిన చరిత్ర వైసీపీ నేతలది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేకమైన ప్రేమ. స్టూడెంట్‌ లీడర్‌గా ప్రయాణం ప్రారంభించిన చంద్రబాబును ఎమ్మెల్యేగా, మంత్రిగా, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేల. దివంగత ఎన్టీఆర్‌కు కూడా జిల్లా అంటే ప్రేమ. మహిళలకోసం మహిళా వర్సిటీ, వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన పథకం ప్రారంభించారు. శ్రీకాళహస్తి విషయానికొస్తే గోపాలన్నకు, బాబు గారికి ఉన్న బంధమే నాకూ, సుధీర్‌కు ఉంది.అనంత్‌ అంబానీ ద్వారా సుమారు 50కోట్ల విరాళాలను సుధీర్‌ తీసుకొచ్చారు. నియోజక వర్గంలో బాగా చదువుకున్న పిల్లల కుటుంబాలకు 3 సెంట్ల భూమి ఇచ్చారు.ఈ నియోజకవర్గంలో 8మందికి రాష్ట్రస్థాయి, 53మందికి నియోజకవర్గస్థాయి పదవులు ఇచ్చాం. ప్రతిపదవిని చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక్క పొరపాటు జరిగినా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు.ప్రతిపక్షంలో ఉన్నపుడు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాది.వారిని ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత సుధీర్‌కు అప్పగిస్తున్నా. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తన నియోజకవర్గంలో 25మందితో చిన్నతరహా పరిశ్రమలు పెట్టించారు. దానిని ఇక్కడ కూడా అమలుచేయండి, అండగా నిలుస్తాం.తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు, అబ్జర్వర్‌ బాబు నాయుడు, నాయకులు అన్నా అనిత, గురవా రెడ్డి, డాక్టర్‌ కోడూరు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.సభలో లోకేశ్‌ చేతుల మీదుగా పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు పి.జస్మిత, జి.సాయి పూజిత, పి.మోహిత్‌ చరణ్‌ సాయిలకు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి ఆధ్వర్యంలో 2 సెంట్ల చొప్పున ఇంటి పట్టాలు అందజేశారు.విద్యార్థుల తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడారు.అనంతరం శ్రీకాళహస్తికి చేరుకున్న లోకేశ్‌ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని పొగడ చెట్టు వద్ద కూర్చుని పూజా క్రతువుల గురించి అడిగి తెలుసుకున్నారు.తరువాత శ్రీకాళహస్తి మండలం ఊరందూరులోని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆతిధ్యం స్వీకరించారు.అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ తిరుమలకు బయల్దేరి వెళ్లారు.రాత్రి 11.20గంటలకు తిరుమల చేరుకున్న లోకేశ్‌కు గాయత్రీ అతిథి భవనం వద్ద టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాక లోకేశ్‌ కర్ణాటక సత్రంలో జరిగే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 01:41 AM