Share News

పదోన్నతి పొందిన డీటీలకు జిల్లాల కేటాయింపు

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:32 AM

రెవెన్యూ శాఖకు సంబంధించి జోన్‌-4 పరిఽధిలోని జిల్లాల్లో అర్హత కలిగిన డీటీలకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే.

పదోన్నతి పొందిన డీటీలకు జిల్లాల కేటాయింపు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖకు సంబంధించి జోన్‌-4 పరిఽధిలోని జిల్లాల్లో అర్హత కలిగిన డీటీలకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. అలా పదోన్నతి పొందిన వారికి జిల్లాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి స్థానికంతో పాటు పక్క జిల్లాలకు కొందరిని.. అక్కడ్నుంచి ఇక్కడకు మరికొందరికి నుంచి పోస్టింగులు కేటాయించారు. జిల్లాలో తహశీల్దార్లుగా పదోన్నతి పొందిన డిప్యూటీ తహశీల్దార్లలో ఇదే జిల్లాకు కేటాయించిన వారిలో.. కె.జనార్దన్‌, ఎ.రాజేంద్ర, పి. రమే్‌షబాబు, ఆర్‌.జయసింహా, పి.శ్రీనివాసులు, కొమ్ము నాగరాజు, పి.రేఖ, షేక్‌ ఖాజావళి, బంటుపల్లె కౌలేష్‌, జి.పి.పార్థసారధి, బి.కళ్యాణి ఉన్నారు. ఇక, చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకు కేటాయించిన వారిలో.. జే.శ్రావణకుమార్‌, ఎస్‌.కిరణ్‌ ఉన్నారు. ఎస్‌.దేవరాజును శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. అలాగే, అన్నమయ్య జిల్లా నుంచి రోషిణా హుస్సేన్‌, నంద్యాల నుంచి ఎం.సోమశేఖర్‌, తిరుపతి నుంచి ఎ.రామకృష్ణ, ఎల్‌.తనూజను చిత్తూరు జిల్లాకు కేటాయించారు.

Updated Date - Jun 05 , 2026 | 12:32 AM