వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రశ్నార్థకం
ABN , Publish Date - May 27 , 2026 | 12:53 AM
చిత్తూరు జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సబ్సిడీపై వీటిని పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారులు వారం పదిరోజులుగా చెబుతున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది ఖరీ్‌్‌ఫలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాబావ పరిస్థితులుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో మాత్రం ఈవర్షాదార పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
ఎల్‌నినో ప్రభావం ఉన్నా సాగుకు సిద్ధం
చిత్తూరు సెంట్రల్, మే 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సబ్సిడీపై వీటిని పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారులు వారం పదిరోజులుగా చెబుతున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది ఖరీ్‌్‌ఫలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాబావ పరిస్థితులుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో మాత్రం ఈవర్షాదార పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా జిల్లాలో అడపాదడపా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురింపజేశాయి. ఈక్రమంలో వేరుశనగ విత్తన కాయలు వేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. అయితే విత్తనాలు అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. నైరుతి అనుకూలిస్తే జూన్ మొదటి వారంలో జిల్లాలో వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈలోగానైనా ఇవ్వకపోతారా అని ఆశగా నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి ఈనెల 15-25 తేదీల మధ్య సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందజేస్తామని వ్యవసాయాధికారులు ప్రకటించారు. ఆతేదీలు దాటిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈఖరీ్‌ఫలో ఇస్తారా?లేదా?అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈవారంలోనైనా విత్తన కాయలు జిల్లాకు చేరితే జూన్ మొదటి వారంలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో వ్యవసాయాధికారులు నోరు మెదపడం లేదు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 54,757 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తారని అంచనా. ఇందుకోసం 27,225 క్వింటాళ్ల విత్తనకాయలు అవసరమవుతాయి.