ఇద్దరు బాలికల అదృశ్యం
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:14 AM
నిమ్మనపల్లి, మండలంలో ఒకే రోజు ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.
నిమ్మనపల్లి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఒకే రోజు ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఎస్‌ఐ రామకృష్ణ వివరాల మేరకు.. రాచివేటివారిపల్లె పంచాయతీ గుండ్లబురుజు హరిజనవాడకు చెందిన బాలిక(16) పలమనేరులోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు పిన్ని వాళ్ల ఇంటికి వెళుతున్నట్లు తల్లితో చెప్పి వెళ్లింది. ఎంతకీ రాకపోవడంతో తల్లి గ్రామంలో విచారించినా ఆచూకీ లభించలేదు. తమిళనాడు రాష్ట్రం హోసూరు జిల్లా బుక్కసాగరానికి చెందిన వరుసకు మేనమామ అయిన సతీ్‌షతో తరచూ ఫోన్‌లో మాట్లాడేదని, అతనే తీసుకెళ్లి ఉంటాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిమ్మనపల్లెకు చెందిన బాలిక (16) ఓ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 24వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో కాలేజీకి వెళ్లింది. సాయంత్రం 7 గంటలైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బాలిక స్నేహితులను విచారించారు. ఆమె కాలేజీకి వెళ్లలేదని తెలిసింది. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. స్థానిక కోటకిందమాలపల్లెకు చెందిన అభిషేక్ ఆలియాస్ చక్రితో సన్నిహితంగా ఉండేదని, అతనే తమ కుమార్తెను తీసుకెళ్లి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.