1.90 లక్షల ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:21 AM
సర్’ ప్రక్రియలో భాగంగా శుక్రవారం నాటికి 1,90,180 ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ (14.19శాతం) పూర్తయిందని చిత్తూరు డీఆర్వో మోహన్‌కుమార్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ‘సర్’ ప్రక్రియలో భాగంగా శుక్రవారం నాటికి 1,90,180 ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ (14.19శాతం) పూర్తయిందని డీఆర్వో మోహన్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 13,40,126 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 12,89,038 మందికి (96.19శాతం) రెండేసి ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలు అందించారు. ఇంకా 51,088 మందికి ఫారాలు అందించాల్సి ఉంది. శాతాలవారీగా నగరిలో 96.84, గంగాధరనెల్లూరులో 96.57, చిత్తూరులో 96.20, పూతలపట్టులో 95.28, పలమనేరులో 95.45, కుప్పంలో 97.0 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జరిగింది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో వంద శాతం పూర్తిచేసి జిల్లాలోనే కుప్పం ప్రథమస్థానంలో ఉండగా, 99.71 శాతంతో చిత్తూరు రూరల్, 98.96 శాతంతో బైరెడ్డిపల్లె తృతీయస్థానంలో నిలిచింది. 87.79శాతంతో చిట్టచివరిస్థానంలో పలమనేరు మునిసిపాలిటీ నిలిచింది.