Share News

ఎమ్మెల్యే శ్రీధర్‌కు జనసేన క్లీన్‌చిట్‌ ఇచ్చిందా?

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:13 AM

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన హర్షవీణ మరోసారి ఆరోపణల దాడి చేసింది. సామాజిక మాధ్యమాల్లో శనివారం ఆమె ఆరోపణల వీడియో వైరల్‌ అయింది.

ఎమ్మెల్యే శ్రీధర్‌కు జనసేన క్లీన్‌చిట్‌ ఇచ్చిందా?

హర్షవీణ ప్రశ్న

రైల్వేకోడూరు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన హర్షవీణ మరోసారి ఆరోపణల దాడి చేసింది. సామాజిక మాధ్యమాల్లో శనివారం ఆమె ఆరోపణల వీడియో వైరల్‌ అయింది.ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని శ్రీధర్‌ను జనసేన అధిష్ఠానం ఆదేశించినప్పటికీ ఆయన విచ్చలవిడిగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాడని పేర్కొంది.జనసేన ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చివుంటే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేసింది.

Updated Date - Mar 22 , 2026 | 01:13 AM