Share News

టీటీడీ తీరుపై భక్తుల అసంతృప్తి

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:43 AM

టీటీడీ ఏటా ప్రచురించే పంచాంగాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ప్రామాణికంగా తీసుకుంటారు.అధికార యంత్రాంగం, పంచాంగకర్తల మఽధ్య సమన్వయం లోపించడంతో ఈ ఏడాది ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల తేదీలు పంచాంగంలో ఒక విధంగా పొందుపర్చగా...టీటీడీ నిర్వహిస్తున్న తేదీలు మాత్రం వేరే ఉన్నాయి.

టీటీడీ తీరుపై భక్తుల అసంతృప్తి

నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం

టీటీడీ పంచాంగంలో మాత్రం ముందురోజే

తిరుపతి(టీటీడీ), మార్చి 31 (ఆంధ్రజ్యోతి) :టీటీడీ ఏటా ప్రచురించే పంచాంగాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ప్రామాణికంగా తీసుకుంటారు.అధికార యంత్రాంగం, పంచాంగకర్తల మఽధ్య సమన్వయం లోపించడంతో ఈ ఏడాది ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల తేదీలు పంచాంగంలో ఒక విధంగా పొందుపర్చగా...టీటీడీ నిర్వహిస్తున్న తేదీలు మాత్రం వేరే ఉన్నాయి. ఒంటిమిట్టలో ధ్వజారోహణం మార్చి27వ తేదీన టీటీడీ నిర్వహించగా పంచాంగంలో మాత్రం 26వ తేదీ అని ముద్రించారు.ఏప్రిల్‌ 1వ తేదీన కల్యాణోత్సవం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే పంచాంగంలో మాత్రం మార్చి 31వ తేదీన ఒక రోజు ముందే ఈ కార్యక్రమాలు జరగనున్నట్లు ముద్రించారు. ఈ వివరాలన్నీ పంచాంగంలోని ఉత్సవ కార్యక్రమాల వివరాల్లో పొందుపర్చారు. అలాగే తిథి, వార, నక్షత్ర వివరాలు తెలిపే పేజీలోనూ ప్రచురించారు.

Updated Date - Apr 01 , 2026 | 01:43 AM