Share News

ముక్కంటి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:55 AM

శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.వరుస సెలవులతో రికార్డు స్థాయిలో సుమారు 56వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం.

ముక్కంటి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

శ్రీకాళహస్తి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.వరుస సెలవులతో రికార్డు స్థాయిలో సుమారు 56వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. రూ.500 అంతరాలయ దర్శనం 712, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 3,578మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 3,351మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 4,617మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,710, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 576మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 490మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 204మంది భక్తులు పూజలుచేయించుకున్నారు. ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 26,280 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Jun 15 , 2026 | 12:55 AM