కిటకిటలాడిన బోయకొండ
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:38 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం అమ్మవారి భక్తులతో కిటకిటలాడింది.
చౌడేపల్లె, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం అమ్మవారి భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే ఆలయ అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 5నుంచి సాయంత్రం 3 గంటల వరకు క్యూలైన్లలో రద్దీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 10 వేల మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శంచుకున్నారు. ఏర్పాట్లను ఈవో ఏకాంబరం పర్యవేక్షించారు.