Share News

బండవేషంలో భక్తుల మొక్కులు

ABN , Publish Date - May 08 , 2026 | 01:54 AM

తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతరలో రెండో రోజైన గురువారం పూలంగిసేవలో గంగమ్మ అనుగ్రహించగా భక్తులు బండవేషంతో సందడి చేశారు.విశ్వరూపం స్తూపం వద్ద పొంగళ్లు పెట్టి నిమ్మకాయల, పిండి దీపాలు వెలిగించి, అంబళ్లు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి ఆర్యవైశ్యులు సారెను సమర్పించారు.బండ వేషంలో శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు దంపతులు సారెను సమర్పించారు. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌ వేయికళ్ల దుత్తలను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించారు.

బండవేషంలో భక్తుల మొక్కులు
గంగమ్మ ఆలయంలో రద్దీ

తిరుపతి(కల్చరల్‌), మే 7(ఆంధ్రజ్యోతి):తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతరలో రెండో రోజైన గురువారం పూలంగిసేవలో గంగమ్మ అనుగ్రహించగా భక్తులు బండవేషంతో సందడి చేశారు.విశ్వరూపం స్తూపం వద్ద పొంగళ్లు పెట్టి నిమ్మకాయల, పిండి దీపాలు వెలిగించి, అంబళ్లు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి ఆర్యవైశ్యులు సారెను సమర్పించారు.బండ వేషంలో శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు దంపతులు సారెను సమర్పించారు. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌ వేయికళ్ల దుత్తలను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించారు.

Updated Date - May 08 , 2026 | 01:54 AM