బోయకొండకు పోటెత్తిన భక్తజనం
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:47 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ ఆదివారం భక్తులతో కిటికిటలాడింది. వేకువజామునే ఆలయ అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాలతో అభిషేకించారు.
చౌడేపల్లె, మార్చి15(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ ఆదివారం భక్తులతో కిటికిటలాడింది. వేకువజామునే ఆలయ అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచేగాక తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు అందుకున్నారు. వివిధ సేవా టికెట్ల ద్వారా ఆలయానికి రూ.5.05లక్షల ఆదాయం చేకూరింది. ఈవో ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు.