పోలింగ్ స్టేషన్లలో దయనీయ పరిస్థితులు
ABN , Publish Date - Nov 05 , 2026 | 01:01 AM
పరిషత్ ఎన్నికల కోసం ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ స్టేషన్లలో వసతులు లేకపోవడంతో ఎన్నికల సిబ్బంది నానాపాట్లు పడ్డారు.
తిరుపతి,నవంబర్ 4(ఆంధ్రజ్యోతి): పరిషత్ ఎన్నికల కోసం ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ స్టేషన్లలో వసతులు లేకపోవడంతో ఎన్నికల సిబ్బంది నానాపాట్లు పడ్డారు. ఉదాహరణకు తొట్టంబేడు మండలం దైనేడులోని పోలింగ్ స్టేషన్‌లో గాఢాంధకారం నెలకొంది. రాత్రి 10 గంటల సమయంలో కూడా విద్యుత్తు లేక పోలింగ్ అధికారులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సివచ్చింది.పిచ్చాటూరు మండలంలోని గోవర్ధనగిరి పోలింగ్ స్టేషన్ పూర్తిగా బురదతో నిండిపోయింది. చాలా పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం, కొన్ని పాఠశాలల్లో పై కప్పులు పెచ్చులూడివుండడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.చాలా మండలాల్లో నాసిరకం భోజనాలు పెట్టడంపై ఎన్నికల సిబ్బంది పెదవి విరుస్తున్నారు.