11 మందిపై శాఖాపరమైన విచారణ
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:03 AM
నాలుగేళ్ళ కిందట ఏసీబీ చేపట్టిన తనిఖీల సందర్భంగా వెలుగు చూసిన తప్పిదాల నేపధ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు ఉద్యోగులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
తిరుపతి మున్సిపల్ టౌన్ ప్లానింగ్‌లో
నాలుగేళ్ళ కిందటి ఏసీబీ తనిఖీల పర్యవసానం
తిరుపతి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ళ కిందట ఏసీబీ చేపట్టిన తనిఖీల సందర్భంగా వెలుగు చూసిన తప్పిదాల నేపధ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు ఉద్యోగులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. 2022 ఆగస్టు 4న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయని, బీపీఎస్ అమలులోనూ, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్‌లోనూ అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఆ సందర్భంగా వెల్లడైన అంశాలపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపధ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లోని 11 మంది ఉద్యోగులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పటి అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఎన్.బాలసుబ్రమణ్యం, పి.శ్రీనివాసులు, పి.షణ్ముగం, టౌన్ ప్లానింగ్ సూజర్‌వైజర్లు జి.శారదాంబ, ఎన్.ఎం.సాయిలీల, టీపీబీవో కె.ధర్మరాజు, సి.జగదీశ్వర్‌రెడ్డి, టౌన్ సర్వేయర్లు బి.దేవానంద్, వి.శ్రీరాములు మురళీ కృష్ణ, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శి ఎం.వి.అనిల్ కుమార్, సూపరింటెండెంట్ మహమ్మద్ హాషిమ్‌లపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురే్‌షకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.