Share News

పెద్దిరెడ్డి నోట ప్రజాస్వామ్యమా.. సిగ్గుచేటు

ABN , Publish Date - Oct 18 , 2026 | 02:19 AM

ఐదేళ్లూ అరాచకాలు, దౌర్జన్యాలు తప్పుడు కేసులతో టీడీపీ శ్రేణులతోపాటు సామాన్యులను ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని జిల్లా ఇన్‌చార్జి మంత్రులు బీసీ.జనార్దన్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

పెద్దిరెడ్డి నోట ప్రజాస్వామ్యమా.. సిగ్గుచేటు

17పీజీఆర్‌1, 2: మీడియాతో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, కిశోర్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నేతలు దామచర్ల సత్య, మధుసూదన్‌నాయుడు, చల్లా రామచంద్రారెడ్డి

ప్రజా తిరుగబాటులో అడ్రస్‌ ఉండదు

పుంగనూరు, రాయచోటి, మదనపల్లెలో టీడీపీ గెలుపు ఖాయం

మంత్రులు జనార్దన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి

పుంగనూరు, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లూ అరాచకాలు, దౌర్జన్యాలు తప్పుడు కేసులతో టీడీపీ శ్రేణులతోపాటు సామాన్యులను ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని జిల్లా ఇన్‌చార్జి మంత్రులు బీసీ.జనార్దన్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పుంగనూరులోని టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అరాచకపాలనకు అలవాటుపడిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఇక్కడ ప్రజలను భయందోళనకు గురి చేయాలంటే కుదరదన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే కనుచూపుమేర కనిపించరన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌ వాహనాలు వెళ్లిన తీరు దారుణమన్నారు. ఎవరిని చంపాలని, ఏం చేయాలని నామినేషన్‌ కేంద్రంలోకి వాహనాలతో వెళ్లారని ప్రశ్నించారు. వాహనాలతో తొక్కిచంపాలనే వచ్చారన్నారు. దాదాపు 700మందికి పైగా కుటుంబాలను పెట్టిన బాధల కన్నీటి ఉసురు పెద్దిరెడ్డి కుటుంబానికి తగులుతోందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలు, సాగునీటి ప్రాజెక్టు పేరుతో పుంగనూరుకు వస్తే వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో పాటు టీడీపీ కార్యకర్తలపై దాదాపు 500మందిపై కేసులు పెట్టిన ఘనత మీదికాదా అని నిలదీశారు. మంత్రి నారా లోకేశ్‌ ప్రతిపక్షంలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తే జిల్లాలో మీరు పెట్టిన ఇబ్బందులు, అడ్డుకున్నది ఎవరని ప్రశ్నించారు. అప్పడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అన్నారు. పుంగనూరు, రాయచోటి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఖర్మ వదలదని, పుంగనూరులో ఎంపీ మిథున్‌ దేహి కాపాడండి అంటూ పోలీసులను అడుక్కొని తిరుపతి ఇంటిలో వదలాలని ప్రాధేయపడిన దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. పలమనేరు ఎమ్మెల్యే, పుంగనూరు ఎన్నికల ఇన్‌చార్జి ఎన్‌.అమరనాథరెడ్డి మాట్లాడుతూ రౌడీ సంస్కృతిని ఈ ప్రాంతానికి పరిచయం చేసింది పెద్దిరెడ్డి కుటుంబమే అన్నారు. రాయచోటిలో వైసీపీ నాయకులు మారణాయుధాలతో పట్టుబడ్డారంటే వారి నైజం తెలుస్తుందన్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి, అయన తనయుడు నీతులు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు. టీడీపీ ఇన్‌చార్జి వై.మధుసూదన్‌నాయుడు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మాజీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, టీడీపీ జోనల్‌ కోఅర్డినేటర్‌ దామచర్ల సత్య, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి శంకర్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే బగ్గిడిగోపాల్‌, నాయకులు ఏఎంసీ చైర్మన్లు శమిపతియాదవ్‌, శ్రీనివాసులునాయుడు, ఎస్‌కే రమణారెడ్డి, సోమల సురేశ్‌, రామనాథంనాయుడు, గువ్వల రమేశ్‌రెడ్డి, ప్రదీ్‌పరాజు, శ్రీకాంత్‌, ఆనందగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 02:19 AM