ఇంటా, బయటా అరటికి డిమాండ్
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:28 AM
అరటి పంటకు డిమాండ్ పెరిగింది.వర్షాభావ పరిస్థితులతో మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్, మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరటిపంట దెబ్బతింది.అయితే రైల్వేకోడూరు నియోజకవర్గంలో బోర్లలో నీటి మట్టం తగ్గకపోవడంతో గెలల సైజుతో పాటు నాణ్యత ప్రమాణాలు బాగుండడంతో జీ-9 రకం అరటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.
రైల్వేకోడూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి):అరటి పంటకు డిమాండ్ పెరిగింది.వర్షాభావ పరిస్థితులతో మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్, మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరటిపంట దెబ్బతింది.అయితే రైల్వేకోడూరు నియోజకవర్గంలో బోర్లలో నీటి మట్టం తగ్గకపోవడంతో గెలల సైజుతో పాటు నాణ్యత ప్రమాణాలు బాగుండడంతో జీ-9 రకం అరటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత ఏడాదిలో ధరల్లేక అరటితో నష్టాలు వచ్చినప్పటికీ రైల్వేకోడూరు, చిట్వేలి, పెనగలూరు.పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాల్లో అరటి పంటను ఈ ఏడాది భారీఎత్తున సాగు చేశారు.డిమాండున్న జీ-9 రకం అరటి పంటను మహారాష్ట్ర, ఢిల్లీ, చెన్నై, హైద్రాబాద్ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.అలాగే దుబాయ్, ఖత్తర్, ఒమన్ తదితర గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.రోజూ తిరుపతి, కడప, రాజంపేట, నెల్లూరు ప్రాంతాలకు పంపిస్తున్నారు.రుచి, రంగు బాగున్న కారణంగా అరటి ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైతులు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా రైల్వేకోడూరులో అరటి కాయలను కొనుగోలు చేయడానికి మకాం వేశారు.