రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:41 AM
మండలంలోని మినికి మలుపు వద్ద బుధవారం టెంపోను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
- మరొకరికి గాయాలు
రామసముద్రం, జూలై 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని మినికి మలుపు వద్ద బుధవారం టెంపోను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కలికిరి మండలం మర్రికుంటపల్లె గ్రామానికి చెందిన సి.సాయితేజ, మత్తిగానిపల్లెకి చెందిన తలారి గణేష్ పుంగనూరులోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ శుభారాం డిగ్రీ కళాశాలలో మొదటి, తృతీయ సంవత్సరం చదువుతున్నారు. రామసముద్రం నుంచి పుంగనూరుకు ద్విచక్ర వాహనంలో వెళుతూ మినికి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న టెంపో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడ్డ గణే్‌షను 108లో పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.