పగలు..సెగలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:44 AM
జిల్లాలో భానుడు చెలరేగిపోతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపుతున్నాడు. ముడు రోజులుగా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. మున్నెన్నడూ లేని విధంగా పలు మండలాల్లో 40 డిగ్రీలకు మించి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
40డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత
రాత్రి వేళా శాంతించని వాతావరణం
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భానుడు చెలరేగిపోతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపుతున్నాడు. ముడు రోజులుగా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. మున్నెన్నడూ లేని విధంగా పలు మండలాల్లో 40 డిగ్రీలకు మించి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే ఐదు రోజులు పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతుందని, రాత్రి ఉష్ణోగ్రతలు 25.2 నుంచి 26.5 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ విభాగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందంటున్నారు. బుధవారం అత్యధికంగా శ్రీరంగరాజపురంలో 41.5 డిగ్రీలు నమోదయింది. మండలాలవారీగా విజయపురం, నగరిలో 41.1, తవణంపల్లెలో 40.8, గంగాధరనెల్లూరు, రొంపిచెర్ల మండలాల్లో 40.3, బంగారుపాళ్యం, నిండ్ర, పులిచెర్ల మండలాల్లో 39.9, గుడిపాల, వెదురుకుప్పం మండలాల్లో 39.5, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్ మండలాల్లో 39.2, పాలసముద్రం, యాదమరి, పెనుమూరు, ఐరాల మండలాల్లో 39.0, పూతలపట్టులో 38.8, పెద్దపంజాణిలో 38.7, శాంతిపురంలో 38.6, గంగవరంలో 38.5, పలమనేరులో 38.0, కార్వేటినగరంలో 37.4, గుడుపల్లిలో 37.1, కుప్పం, రామకుప్పంలో 36.9, బైరెడ్డిపల్లి, వి.కోట మండలాల్లో 36.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.