ధరిత్రి పరిరక్షణకు సైకిల్ ర్యాలీ
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:53 AM
ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈశా వలంటీర్లు, చిత్తూరు రైడర్స్ బుధవారం సేవ్ సాయిల్ పేరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
చిత్తూరు రూరల్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈశా వలంటీర్లు, చిత్తూరు రైడర్స్ బుధవారం సేవ్ సాయిల్ పేరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశా వలంటీర్ పుష్ప మాట్లాడుతూ సేవ్ సాయిల్ అనేది సద్గురు ప్రారంభించిన గ్లోబల్ కార్యక్రమమన్నారు. నేల క్షీణతపై అవగాహన పెంపొందించడం, స్థిరమైన భవిష్యత్తు కోసం మట్టిని సంరక్షించడం దీని ప్రధాన లక్ష్యమన్నారు. రైడర్ డాక్టర్ జయంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటాలని సూచించారు. అనంతరం గాంధీ సర్కిల్ నుంచి ఎస్వీ సెట్ వరకు సమారు 20 కిలో మీటర్లు సైక్లింగ్ చేశారు. కార్యక్రమంలో రైడర్లు, ఈశా వాలంటీర్లు వాసు, రమేష్, భరత్‌రెడ్డి, సురేంద్ర, వినోద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.