రిటైర్డు తహసీల్దారు పెన్షన్‌లో కోత
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:49 AM
గతంలో యాదమరి తహసీల్దారుగా పనిచేసి ప్రస్తుతం రిటైరైన కె.ఆర్.రమేష్ పెన్షన్‌లో ఐదేళ్లపాటు ప్రతి నెలా 3 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): గతంలో యాదమరి తహసీల్దారుగా పనిచేసి ప్రస్తుతం రిటైరైన కె.ఆర్.రమేష్ పెన్షన్‌లో ఐదేళ్లపాటు ప్రతి నెలా 3 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. యాదమరి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన అర్హత లేనివారికి చిన్నరైతు, ఆదాయ ధ్రువీకరణపత్రాలను జారీచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పటి జేసీని విచారణాధికారిగా, డీఆర్వోను ప్రెజెంటింగ్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. 2025 ఏప్రిల్ 22న విచారణాధికారి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రమేష్ నుంచి పలు దఫాలు అంశాలవారీగా ప్రభుత్వం వివరణలు, సంజాయిషీలు తీసుకుంది. తాజాగా మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఆయన పెన్షన్‌లో కోత విధించింది.