Share News

బైరాగి వేషంలో భక్తుల సందడి

ABN , Publish Date - May 07 , 2026 | 01:41 AM

గంగమ్మ జాతరలో భక్తుల సందడి మొదలైంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో తొలి రోజైన బుధవారం బైరాగి వేషధారణతో కనువిందు చేశారు.

బైరాగి వేషంలో భక్తుల సందడి

తిరుపతి(కల్చరల్‌), మే 6(ఆంధ్రజ్యోతి): గంగమ్మ జాతరలో భక్తుల సందడి మొదలైంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో తొలి రోజైన బుధవారం బైరాగి వేషధారణతో కనువిందు చేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా శరీరమంతా నామ కొమ్ము, విభూది పూసుకుని రెళ్ల కాయలు, పుష్పాలు మాలలుగా ధరించి తమ తమ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు చేశారు. వేయికళ్ల దుత్తలతో పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొంత మంది పురుషులు మహిళల వేషం ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రత్యేక అలంకరణతో గంగమ్మ దర్శనం

అమ్మవారి మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలకరించారు. కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళా భక్తులు విశ్వరూప స్తూపం వద్ద పొంగళ్లు పెట్టి అంబళ్లు పోసి గంగమ్మకు పూజలు చేశారు. ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు.

Updated Date - May 07 , 2026 | 01:41 AM