Share News

ముక్కంటి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:50 AM

ముక్కంటి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ మహాశివరాత్రి పర్వదినాన్ని తలపించింది.వేసవి సెలవుల ముగింపుతో పాటు రెండవ శనివారం, ఆదివారం సెలవులు కలసి రావడం.. దానికితోడు శని త్రయోదశి విశేష పర్వదినం కావడంతో భక్తులు పోటెత్తారు

ముక్కంటి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ
కిటకిటలాడుతున్న ముక్కంటి ఆలయం

శ్రీకాళహస్తి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ముక్కంటి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ మహాశివరాత్రి పర్వదినాన్ని తలపించింది.వేసవి సెలవుల ముగింపుతో పాటు రెండవ శనివారం, ఆదివారం సెలవులు కలసి రావడం.. దానికితోడు శని త్రయోదశి విశేష పర్వదినం కావడంతో భక్తులు పోటెత్తారు సుమారు 42వేలమంది భక్తులు దర్శించుకున్నారు.ఐదు రకాల ప్రసాదాలు కలిపి రికార్డుస్థాయిలో 27,432 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Jun 14 , 2026 | 01:50 AM