ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:53 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీకాళహస్తి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 212, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 761మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 556మంది దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 3,369మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,239 మంది, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 392మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 266మంది, రూ.5వేల టిక్కెట్ల ద్వారా 144మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 22,538 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.