Share News

ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:56 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. వారాంతపు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
దర్శనానికి వెళుతున్న భక్తులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. వారాంతపు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 651, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 2,128మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 3,105మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.500 రాహు-కేతు టిక్కెట్ల ద్వారా 2,649మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,238, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 405మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 271మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 89మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 19,540 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Apr 20 , 2026 | 12:56 AM