ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:10 AM
ముక్కంటి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 30వేలమంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 365, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 2,954మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 2,150మంది దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 4,153మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,558, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 741మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 522మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 246మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 28,777 విక్రయించినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
శ్రీకాళహస్తి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ముక్కంటి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 30వేలమంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 365, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 2,954మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 2,150మంది దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 4,153మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,558, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 741మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 522మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 246మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 28,777 విక్రయించినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.