Share News

కాణిపాకంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:26 AM

కాణిపాకం శనివారం భక్తులతో కిటకిటలాడిండి. సెలవు దినం కావడంతో జిల్లా నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి వెలుపల వరకు భక్తులు వ్యాపించారు.

కాణిపాకంలో భక్తుల రద్దీ
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): కాణిపాకం శనివారం భక్తులతో కిటకిటలాడిండి. సెలవు దినం కావడంతో జిల్లా నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి వెలుపల వరకు భక్తులు వ్యాపించారు. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా ఈవో పెంచలకిషోర్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది.

17న వరసిద్ధుడి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం

కాణిపాక వరసిద్ధుని ఆలయ ధర్మకర్తల మండలి సమావేశాన్ని ఈ నెల 17న నిర్వహించనున్నట్లు చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌లు శనివారం తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వారు తెలియజేశారు. ఆలయ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు వారు వివరించారు.

Updated Date - Jun 14 , 2026 | 01:26 AM