కాణిపాకంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:31 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం బుధవారం కిటకిటలాడింది. స్వామి దర్శనార్థం ఉదయం వేలాది భక్తులు ఆలయానికి విచ్చేశారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం బుధవారం కిటకిటలాడింది. స్వామి దర్శనార్థం ఉదయం వేలాది భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయంలో క్యూలైన్లు నిండి భక్తులు వెలుపల వరకు నిరీక్షిస్తూ నిలబడ్డారు. అధికారులు దగ్గరుండి క్యూలైన్లను నియంత్రించారు. భక్తుల దాహార్తి తీర్చడానికి తాగునీరు, మజ్జిగ, అల్పాహారాన్ని అందించారు.
- ఐరాల(కాణిపాకం), ఆంధ్రజ్యోతి