Share News

రూ.35,907 కోట్లతో రుణ ప్రణాళిక

ABN , Publish Date - Jul 10 , 2026 | 01:31 AM

జిల్లా బ్యాంకుల వార్షిక జీవనోపాధి ప్రణాళిక బుక్‌లెట్‌ను గురువారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆవిష్కరించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.35,907 కోట్ల రుణ ప్రణాళికను జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రూ.35,907 కోట్లతో రుణ ప్రణాళిక
బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తదితరులు

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా బ్యాంకుల వార్షిక జీవనోపాధి ప్రణాళిక బుక్‌లెట్‌ను గురువారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆవిష్కరించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.35,907 కోట్ల రుణ ప్రణాళికను జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆర్ధికాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. నిర్దేశించిన రుణ లక్ష్యాలను వంద శాతం అమలుచేయడానికి బ్యాంకులు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజరు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 01:31 AM