Share News

కాణిపాకంలో గోపూజ

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:21 AM

కాణిపాక వరసిద్ధుడి ఆలయ ఆవరణలోని గోశాలలో శుక్రవారం గోకులాష్టమిని పురస్కరించుకుని అధికారులు గోపూజను నిర్వహించారు. కాణిపాకానికి చెందిన రాజేంద్రయాదవ్‌, ధనంజయయాదవ్‌ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.

కాణిపాకంలో గోపూజ

కాణిపాక వరసిద్ధుడి ఆలయ ఆవరణలోని గోశాలలో శుక్రవారం గోకులాష్టమిని పురస్కరించుకుని అధికారులు గోపూజను నిర్వహించారు. కాణిపాకానికి చెందిన రాజేంద్రయాదవ్‌, ధనంజయయాదవ్‌ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. గోవులను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమపెట్టి పూలమాలలతో అలంకరించారు. గోశాల ఏఈవో ధనంజయ, ఉభయదారులు కలసి గోవులకు పచ్చగడ్డి తినిపించారు. గోశాల ప్రాంగణంలో ప్రజలు ఉట్టి కొట్టారు. బోర్డు సభ్యుడు శివప్రసాద్‌, సూపరింటెండెంట్‌ వాసు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 01:21 AM