విద్యుత్‌షాక్‌తో దంపతులు మృతి
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:49 AM
క్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాల్లో విద్యుత్ ప్రమాదాలు ముగ్గురిని బలితీసుకున్నాయి. వాకాడు మండలం రావిగుంటపాళెం పంచాయతీలోని తీపలపూడి గ్రామానికి చెందిన ఈదూరు కుమార్ (41),ఆయన భార్య పుష్ప (36) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.... అయ్యప్ప మాలధారణలో ఉన్న కుమార్ మంగళవారం తెల్లవారుజామున స్నానం చేసేందుకు ఇంటి ఆవరణలో ఉన్న మోటారు వద్దకు వెళుతుండగా తెగిపడి ఉన్న విద్యుత్ వైరు తగిలింది. షాక్‌కు గురై కేకలు వేస్తూ అక్కడే కుప్పకూలి పోయాడు. భర్త అరుపులు విని బయటకొచ్చిన పుష్ప అతడిని పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై అక్కడే ప్రాణాలు కోల్పోయింది. కూలి పనులతో జీవనం సాగిస్తున్న వీరి పెద్ద కుమార్తె యశస్విని నెల్లూరు జిల్లాలోని బుచ్చి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటుండగా చిన్న కుమార్తె తేజస్విని నాయుడుపేట మండలం పుదూరు గురుకులంలో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో వీరిద్దరూ దిక్కులేని వారయ్యారు.
విద్యుత్‌షాక్‌తో దంపతులు మృతి
వాకాడు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాల్లో విద్యుత్ ప్రమాదాలు ముగ్గురిని బలితీసుకున్నాయి. వాకాడు మండలం రావిగుంటపాళెం పంచాయతీలోని తీపలపూడి గ్రామానికి చెందిన ఈదూరు కుమార్ (41),ఆయన భార్య పుష్ప (36) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.... అయ్యప్ప మాలధారణలో ఉన్న కుమార్ మంగళవారం తెల్లవారుజామున స్నానం చేసేందుకు ఇంటి ఆవరణలో ఉన్న మోటారు వద్దకు వెళుతుండగా తెగిపడి ఉన్న విద్యుత్ వైరు తగిలింది. షాక్‌కు గురై కేకలు వేస్తూ అక్కడే కుప్పకూలి పోయాడు. భర్త అరుపులు విని బయటకొచ్చిన పుష్ప అతడిని పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై అక్కడే ప్రాణాలు కోల్పోయింది. కూలి పనులతో జీవనం సాగిస్తున్న వీరి పెద్ద కుమార్తె యశస్విని నెల్లూరు జిల్లాలోని బుచ్చి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటుండగా చిన్న కుమార్తె తేజస్విని నాయుడుపేట మండలం పుదూరు గురుకులంలో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో వీరిద్దరూ దిక్కులేని వారయ్యారు.