Share News

వడ్డీ వ్యాపారుల వేధింపులతో దంపతుల ఆత్మహత్య

ABN , Publish Date - Apr 05 , 2026 | 01:23 AM

వడ్డీ వ్యాపారుల వేధింపులతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టివారిపల్లెలో చోటుచేసుకుంది. శెట్టివారిపల్లెకు చెందిన మల్లికార్జున(35) గాలివీడులోని ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

వడ్డీ వ్యాపారుల వేధింపులతో దంపతుల ఆత్మహత్య
మృతిచెందిన మల్లికార్జున

గాలివీడు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): వడ్డీ వ్యాపారుల వేధింపులతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టివారిపల్లెలో చోటుచేసుకుంది. శెట్టివారిపల్లెకు చెందిన మల్లికార్జున(35) గాలివీడులోని ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య రాణి(30), ఐదేళ్లు, మూడు నెలల కుమార్తెలు ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం స్థానికంగా ఉన్న పలువురి వద్ద రూ.10లక్షల వరకు అప్పు తీసుకున్నారు. ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బు కుటుంబ అవసరాలకు సరిపోయేది. ఈ క్రమంలో అప్పు, వడ్డీలు అంతకంతకు పెరిగి రూ.50లక్షలకు పైగా చేరాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. తట్టుకోలేక శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇంట్లో ఇద్దరూ పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి 108లో రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కడపకు తరలించారు. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మల్లికార్జున మృతి చెందాడు. కొంత సమయానికి రాణి కూడా మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వడ్డీ వ్యాపారుల పేర్లతో సహా రాణి వీడియో విడుదల చేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Apr 05 , 2026 | 01:23 AM