Share News

జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌17 ప్రయోగానికి నేటినుంచి కౌంట్‌డౌన్‌

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:21 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. ఎర్త్‌ అబ్జర్వేషన్‌లో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఈవోఎస్‌-05 ఉపగ్రహాన్ని జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా రోదసిలోకి పంపనున్నారు. శ్రీహరికోటలోని సతీ్‌షధావన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం తెల్లవారు జామున 2.55 గంటలకు ప్రయోగించనున్నారు.

జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌17 ప్రయోగానికి నేటినుంచి కౌంట్‌డౌన్‌
రెండవ ప్రయోగ వేదికపై జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌

సూళ్లూరుపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. ఎర్త్‌ అబ్జర్వేషన్‌లో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఈవోఎస్‌-05 ఉపగ్రహాన్ని జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా రోదసిలోకి పంపనున్నారు. శ్రీహరికోటలోని సతీ్‌షధావన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం తెల్లవారు జామున 2.55 గంటలకు ప్రయోగించనున్నారు.ఈ ప్రయోగానికి సంబంధించిన మిషనర్‌ రెడీనెష్‌ రివ్యూ సమావేశం మంగళవారం షార్‌లో ఎంఆర్‌ఆర్‌ చైర్మన్‌ మోహన్‌ అధ్యక్షతన జరిగింది.ప్రయోగంపై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం షార్‌ డైరెక్టర్‌ ముత్తు చెళియన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపింది.కౌంట్‌డౌన్‌ను బుధవారం రాత్రి 11.25 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా నిర్వహించే రిహార్సల్‌ను కూడా శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. దేశ సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎప్పటికప్పుడు వాతావారణాన్ని అంచనా వేయడానికి ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడనుంది.

Updated Date - Sep 02 , 2026 | 01:21 AM