కరోనాపై యాక్షన్ ప్లాన్
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:10 AM
కడపలో కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.రుయాస్పత్రితో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రుయాలో ఇప్పటికే 15పడకల సామర్థ్యంతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసిన అధికారులు అక్కడ అవసరమైన మౌలిక వసతులు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ పడకలు, అవసరమైన వెంటిలేటర్లు, క్రిటికల్ కేర్ సదుపాయం, అత్యవసర మందులు, ఎన్-5 మాస్కులు, శానిటైజర్ల నిల్వలు ఏర్పాటు చేశారు.
జ్వరం, శ్వాసకోశ లక్షణాలపై నిఘా
తిరుపతి సెంట్రల్, జూలై 14(ఆంధ్రజ్యోతి): కడపలో కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.రుయాస్పత్రితో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రుయాలో ఇప్పటికే 15పడకల సామర్థ్యంతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసిన అధికారులు అక్కడ అవసరమైన మౌలిక వసతులు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ పడకలు, అవసరమైన వెంటిలేటర్లు, క్రిటికల్ కేర్ సదుపాయం, అత్యవసర మందులు, ఎన్-5 మాస్కులు, శానిటైజర్ల నిల్వలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే విషయాలపై యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు, అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రోజువారీ వస్తున్న కేసుల్లో ఆయాసం, ఆస్మా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వున్న రోగులను గుర్తించి వారికి పరీక్షలు చేసి వాస్తవపరిస్థితిని గుర్తించి నివేదికలు ఎప్పటి కప్పుడు సమర్పించాలని జిల్లా వైద్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన వారికి కోవిడ్ పరీక్షలు చేసి పాజిటివ్‌గా తేలితే వెంటనే వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.ప్రధానంగా వృద్ధులు, గర్భిణులతో పాటు గుండె, ఊపిరితిత్తులు, మధుమేహం, మూత్ర పిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక నిఘా వుంచాలని వైద్యాధికారులకు సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, గ్రామ ఆరోగ్య సిబ్బంది ద్వారా కరోనా లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ విషయమై డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.కరోనా విషయంలో అనసవర ప్రచారాలు నమ్మకండని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.