ఉచిత న్యాయ సహాయం కోసం 15100 నెంబరులో సంప్రదించండి
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:28 AM
బడుగు, బలహీనవర్గాలకు ఉచితంగా న్యాయం అందించడమే న్యాయ సేవాసంస్థల ప్రధాన ధ్యేయమని ఏపీ ఎస్‌ఎల్‌ఎ్‌సఏ డిప్యూటీ సెక్రటరీ అమర రంగేశ్వరరావు అన్నారు. ప్రజలు ఉచిత న్యాయ సహాయం పొందేందుకు జాతీయ టోల్‌ఫ్రీ నెంబరు ‘15100’లో సంప్రదించాలన్నారు.
చిత్తూరు లీగల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవర్గాలకు ఉచితంగా న్యాయం అందించడమే న్యాయ సేవాసంస్థల ప్రధాన ధ్యేయమని ఏపీ ఎస్‌ఎల్‌ఎ్‌సఏ డిప్యూటీ సెక్రటరీ అమర రంగేశ్వరరావు అన్నారు. ప్రజలు ఉచిత న్యాయ సహాయం పొందేందుకు జాతీయ టోల్‌ఫ్రీ నెంబరు ‘15100’లో సంప్రదించాలన్నారు. చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న డీఎల్‌ఎ్‌సఏ భవనంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ న్యాయసహాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో న్యాయ సేవాసంస్థల చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, దివ్యాంగులకు ఆదాయ పరిమితి లేకుండా ఉచిత న్యాయసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర వర్గాల వారికి వార్షిక ఆదాయం రూ. 3 లక్షల్లోపు ఉంటే ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులని వివరించారు. డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ భారతి తదితరులు పాల్గొన్నారు.