Share News

అలిపిరి తనిఖీ కేంద్రంలో రద్దీ తగ్గింది

ABN , Publish Date - Aug 14 , 2026 | 02:33 AM

కొద్దిరోజులుగా వాహనాలతో కిటకిటలాడుతున్న అలిపిరి తనిఖీ కేంద్రం గురువారం ఇలా నిర్మానుష్యంగా కనిపించింది.ఇటీవల సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో నిత్యం దాదాపు 10 వేల వాహనాలు కొండకు చేరుకుంటున్న విషయం తెలిసిందే.

 అలిపిరి తనిఖీ కేంద్రంలో రద్దీ తగ్గింది
గురువారం ఉదయం 12గంటలకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఇదీ పరిస్థితి

తిరుమల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):కొద్దిరోజులుగా వాహనాలతో కిటకిటలాడుతున్న అలిపిరి తనిఖీ కేంద్రం గురువారం ఇలా నిర్మానుష్యంగా కనిపించింది.ఇటీవల సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో నిత్యం దాదాపు 10 వేల వాహనాలు కొండకు చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి జూపార్కు రోడ్డు వరకూ వాహనాలు నిలిచిపోతూ కనిపించాయి. అయితే గురువారం మాత్రం అలిపిరిలో వాహన రద్దీ తక్కువగా కన్పించింది. అయినప్పటికీ తిరుమలలో సర్వదర్శనం కోసం భక్తులు శిలాతోరణం సర్కిల్‌ వరకు క్యూలైన్‌లో వేచివుండడం గమనార్హం.

Updated Date - Aug 14 , 2026 | 02:33 AM