Share News

మౌలిక వసతులు పూర్తి చేయండి

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:40 AM

స్థానిక ఇందిరమ్మ కాలనీలోని జడ్పీ హైస్కూల్‌లో మౌలిక సదుపాయాలకు సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని డీఈవో సబ్రమణ్యం ఆదేశించారు. శుక్రవారం ఆయన పాఠశాలను సందర్శించి, పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మౌలిక వసతులు పూర్తి చేయండి
కలికిరి ఇందిరమ్మ కాలనీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో సుబ్రమణ్యం

కలికిరి జడ్పీ హైస్కూల్లో డీఈవో తనిఖీలు

కలికిరి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక ఇందిరమ్మ కాలనీలోని జడ్పీ హైస్కూల్‌లో మౌలిక సదుపాయాలకు సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని డీఈవో సబ్రమణ్యం ఆదేశించారు. శుక్రవారం ఆయన పాఠశాలను సందర్శించి, పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల కమిటీని ఫీల్డ్‌ ఇంజినీరుతో సమన్వయపరిచి వీలైనంత త్వరగా మరగుదొడ్లు, ఇతర మరమ్మతులు పూర్తి చేయించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. ఈ సంవత్సరం పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. సమీపంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి నిర్వహణ విధానం, ఉపాధ్యాయుల పనితీరు చక్కగా ఉందని హెచ్‌ఎం శ్రీకాంత్‌ను ప్రశంసించారు. పీఎంశ్రీ కింద ఎంపికయిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పచ్చదనం ఆహ్లాదకరంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంశ్రీలో ఏర్పాటు చేసిన బయాలజీ ల్యాబ్‌ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం కూడా బాగుందని కితాబిచ్చారు. వందశాతం ఫలితాలు రాబట్టేందుకు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని హెచ్‌ఎం వీజీఎన్‌ రాజుకు చెప్పారు. డీఈవో వెంట సీఆర్‌ఎంటీలు సురేష్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 01:40 AM