మదనపల్లెలో పోటాపోటీగా నామినేషన్ల దాఖలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:57 AM
అన్నమయ్య, జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మదనపల్లె, పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటీల్లో మొత్తం 128 వార్డులు ఉండగా 558 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ స్థానాలకు 30 మంది నామినేషన్ వేశారు.
మూడు మున్సిపాలిటీల్లో 128 వార్డులకు 558 నామినేషన్లు.. చైర్మన్కు 30
అన్నమయ్య, అక్టోబర్ 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మదనపల్లె, పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటీల్లో మొత్తం 128 వార్డులు ఉండగా 558 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ స్థానాలకు 30 మంది నామినేషన్ వేశారు. మొదటి రోజు పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటీల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులతో కలిసి నామినేషన్ల కేంద్రంలోకి 8 వాహనాల కాన్వాయ్తో వెళ్లడం, కార్లతో టీడీపీ నేతలను ఢీకొట్టించడం, వారు తిరగబడటంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం విదితమే. రెండో రోజు రాయచోటిలో చెదురుమదురు ఘటనలు జరిగాయి. చివరి రోజైన ఆదివారం మూడు మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. మదనపల్లె మున్సిపాలిటీలో ఆదివారం టీడీపీ, వైసీపీ చైర్మన్ అభ్యర్థులు జి.శ్రీరామ్చినబాబు, జింకా వెంకటాచలపతి వేర్వేరుగా తమ నేతల మద్దతుతో వచ్చి రెండోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. కౌన్సిలర్ అభ్యర్థులు కూడా తాము పోటీ చేస్తున్న వార్డులకు నామినేషన్లు వేశారు. పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటీలలో టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వైసీపీ తరఫున ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. టీడీపీతో పాటు ఇతర పార్టీల నేతలు నామినేషన్లు వేశారు.
మదనపల్లె
వార్డులు : 48
దాఖలైన నామినేషన్లు : 390
టీడీపీ 162, వైసీపీ 153, జనసేన 26, బీఎస్పీ 2, బీపేజీ 14, ఇండియన్ కాంగ్రెస్ 1, స్వతంత్రులు 32
చైర్మన్ పదవికి నామినేషన్లు : 20
టీడీపీ 6, వైసీపీ 9, బీఎ్సపీ 1, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 3
పుంగనూరు
వార్డులు : 36
దాఖలైన నామినేషన్లు : 100
టీడీపీ 78, జనసేన 11, బీజేపీ 5, సీపీఐ 1, ఎస్డీపీఐ 1, స్వతంత్రులు 4
ఛైర్మన్ పదవికి నామినేషన్లు 8
టీడీపీ 8
రాయచోటి
వార్డులు : 44
దాఖలైన నామినేషన్లు : 68
టీడీపీ 61, బీజేపీ 3, జనసేన 1, స్వతంత్రులు 3
ఛైర్మన్ పదవికి నామినేషన్లు 2
టీడీపీ 1, స్వతంత్రులు 1